Gandhi Bhavan: మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క

by Ramesh Goud |

ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం అని పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు.

Gandhi Bhavan: మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం అని పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. గాంధీభవన్ (Gandhi Bhavan)లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం (Face-to-face program with ministers)లో బుధవారం సీతక్క పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు విన్నవించుకునేందుకు గాంధీభవన్ కు వచ్చిన కార్యకర్తలు, ప్రజల (public) నుంచి వినతులు(requests) స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున గాంధీభవన్ కు తరలివచ్చారు. మంత్రి సీతక్క వారు చెప్పిన సమస్యలు వినడంతో పాటు కొన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే తక్షణ పరిష్కారం చూపించారు.

ఈ కార్యక్రమంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. ముఖాముఖి, ప్రజా సంకల్పం అంటూ.. హైదరాబాద్(Hyderabad) గాంధీ భవన్‌లో పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు, వారి సమస్యలను ప్రత్యక్షంగా విని, సంబంధిత శాఖ అధికారుల (relevant department officials)తో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని నినదించారు.

కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాత్మ జ్యోతి బాపులే (Mahatma Jyoti Bapule) ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం (Prajavani programme) నిర్వహించి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని గాంధీ భవన్ లో కూడా ఏర్పాటు చేసి, పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన రోజున మంత్రులకు విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రులు సుముఖత వ్యక్తం చేయడంతో.. ప్రతీ వారం రెండు రోజుల పాటు ఇద్దరు మంత్రుల గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండు గంటల పాటు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నారు. కొన్ని సమస్యలను అక్కడే అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.

Next Story