HYD: అక్షరాల రూ.2.32 కోట్ల ధర పలికిన గణపతి లడ్డూ

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-06 03:05:12  IST  )

హైదరాబాద్(Hyderabad) రాజేంద్రనగర్‌లోని గణపతి లడ్డూ(Ganapati Laddu) రెండు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది.

HYD: అక్షరాల రూ.2.32 కోట్ల ధర పలికిన గణపతి లడ్డూ
X

దిశ, వెబ్‌డెస్క్/గండిపేట: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రిచ్ మండ్ విల్లాస్ లో ప్రతిష్టించిన గణనాథుడి లడ్డూ సరికొత్త రికార్డును సృష్టించింది. పాత రికార్డులను తిరగరాస్తూ రూ.2.31 కోట్ల ధర పలకడం విశేషం. గత సంవత్సరం ఇక్కడ గణేషుడి లడ్డూ రూ.1.87 కోట్ల ధర పలికింది. రిచ్ మండ్ విల్లాస్ లడ్డూ వేలం పాటకు ఒక ప్రత్యేకత ఉంది. అర్వి దియా అనే చారిటబుల్ ట్రస్టు సభ్యులు నాలుగు గ్రూపులుగా ఏర్పడతారు. వారంతా వేలంపాట పాడి దక్కించుకుంటారు. తిరిగి ఆ సొమ్మును ట్రస్టులో జమ చేసి సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఇక్కడి ప్రత్యేకత. వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న గ్రూపుతోపాటు మిగిలిన గ్రూపుల వాళ్లు పాడిన మొత్తం కూడా వేలంలో కలిపేయడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఇక్కడి లడ్డూకు భారీ మొత్తం ధర పలుకుకుతోంది. వచ్చిన డబ్బుతో ఆర్పి దియా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా విద్య, వైద్యం, ఆరోగ్య, ఇతర కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడికి విల్లాస్ లో ఉన్న స్థానికులతో ఇతర ప్రాంతాలు, దేశ విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం ఇక్కడ నిర్వహించే వేలం పాటలో డబ్బులు ఇవడం గొప్ప విషయం. అయితే ఆర్వి దియా ట్రస్ట్ సేవలపై మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో పాటు ఎంతోమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయాక వేలంపాట నిర్వహించిన నిర్వాహకులు శనివారం వినాయకుడిని నిమజ్జనం నిర్వహిస్తారు.




Next Story