- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా: BRS ఎమ్మెల్యేల వినూత్న నిరసన
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా రైతులను యూరియా (Urea) కొరత వేధిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా రైతులను యూరియా (Urea) కొరత వేధిస్తోంది. ఓ వైపు జోరు వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నం కవాల్సిన రైతులు యూరియా బస్తాల కోసం పీఏసీఎస్‌ల ఎదుట క్యూ కడుతున్నారు. అక్కడే పడిగాపులు కాస్తూ.. తమ వంతు ఎప్పుడొస్తుందోనని యూరియా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల వేళ తొలిరోజే బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టింది.
సభకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా యూరియా ఖాళీ బస్తాలను పట్టుకుని ‘గణపత్తి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అన్నదాతలకు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన యూరియా సరఫరా చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సంజయ్, మాజీ ఎమ్మెల్యే మధుసూదనా చారి, తదితరులు పాల్గొన్నారు.






