- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ సర్కార్ BIG షాక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie) విషయంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie) విషయంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అనుమతిచ్చిన మార్నింగ్ స్పెషల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ హోంశాఖ(Telangana Home Department) శనివారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాగా, టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి.. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. దీనిపై పునరాలోచించాలని చెప్పింది.
ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. తమిళ అగ్ర దర్శకుడు శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి(Anjali), శ్రీకాంత్(Srikanth), ఎస్‌జే సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. తొలిరోజు ఈ సినిమా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.






