- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌ను ఓడించేందుకు గజ్వేల్ ప్రజలు సిద్ధం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారు.. ఎక్కడ పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో

X
దిశ, వెబ్‌డెస్క్: గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారు.. ఎక్కడ పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గజ్వేల్‌లో రేవంత్ మాట్లాడుతూ.. గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. గజ్వేల్‌లోని పేదల భూములను కేసీఆర్ లాక్కున్నారు, ఇప్పుడు కామారెడ్డి భూములను దోచుకునేందుకు అక్కడికి వెళ్లారని విమర్శించారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇవాళ నేను గజ్వేల్ వస్తున్నానని తెలిసి.. కేసీఆర్ తన నియోజకవర్గమైన కొడంగల్ వెళ్లారన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మన బతుకులు బాగుపడతాయని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story






