- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ కు మతిస్థిమితం లేదు..!
బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని టీపీసీసీ జనరల్

కేటీఆర్ కు మతిస్థిమితం లేదు..
* రోడ్లపై చర్చకు కేటీఆర్ ఎమ్మెల్యే నా.. సర్పంచ్ వా!
* టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం విమర్శించారు. గాంధీ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమవేశంలో గజ్జల కాంతం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా సమస్యలపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే.. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడాలి కదా? అన్నారు. రోడ్ల పైన చర్చ పెట్టడానికి.. కేటీఆర్ఎమ్మెల్యే నా.. సర్పంచ్ వా అని దుయ్యబట్టారు. కేసీఆర్ కి మొదటి గురువు ఎన్టీఆర్, రెండవ గురువు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.
తెలంగాణను కేసీఆర్ ఒక్కడే తీసుకురాలేది, ఉద్యమంలో కాంగ్రెస్‌నేతలు ముఖ్య పాత్ర పోషించారని గుర్తుచేశారు. అమరుల త్యాగాలతో తెలంగాణ సాకారం అయ్యిందన్నన్నారు. కాంగ్రెస్‌పార్టీలో రేవంత్ రెడ్డి స్వయం కృషితో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ‘‘కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నాం.. మీ స్థాయికి మా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వస్తారు’’..అని పేర్కొన్నారు. మీరు చర్చకు వస్తారా?.. మేమే ఏర్పాట్లు చేస్తాం, దేనిపైన అయిన చర్చకు సిద్ధమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం స్పష్టం చేశారు.






