బీఆర్ఎస్ అధ్యక్షుడు లేక ప్రతిపక్ష నేతగా ఎస్సీని చేయాలి: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, గజ్జెల కాంతం

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని లేక ప్రతిపక్ష నాయకుడిని ఎస్సీని చేయాలని, లేదంటే కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం విమర్శించారు.

బీఆర్ఎస్ అధ్యక్షుడు లేక ప్రతిపక్ష నేతగా ఎస్సీని చేయాలి: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, గజ్జెల కాంతం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని లేక ప్రతిపక్ష నాయకుడిని ఎస్సీని చేయాలని, లేదంటే కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం విమర్శించారు. శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఎన్ని మాట్లాడినా అధికారంలోకి రారని, మా కుటుంబం తెలంగాణను దోచుకుంది అని కవిత అంటున్నారని, ముందు కవిత పార్టీ గురించి తేల్చుకోవాలని గజ్జెల కాంతం హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ పదేండ్లు అధికారంలో ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఆయన మండిపడ్డారు.

తెలంగాణను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారని, కవిత ఒక పార్టీ పెట్టింది, రేపు హరీష్ రావు ఒక పార్టీ పెట్టబోతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి, మూడు లక్షల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మీరు చేసిన అప్పులకు సీఎం రేవంత్ రెడ్డి వడ్డీలు కడుతూ ప్రజల కిచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతి భవన్ లో, ఫాంహౌస్ లో ఉన్నారే తప్ప, ప్రజల కోసం ఏనాడు ఆలోచించలేదని గజ్జెల కాంతం విమర్శించారు.

Next Story