- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి.. అధికారికంగా పదవీ బాధ్యతల స్వీకరణ
జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఇవాళ అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని మహిళల భద్రత, హక్కుల రక్షణే ధ్యేయంగా ఆమె ఈ కొత్త బాధ్యతల్లో అడుగుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గద్వాల విజయలక్ష్మిని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఇటీవలే అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్‌గా సేవలందించిన అనుభవం విజయలక్ష్మికి ఉండటంతో, రాష్ట్రంలోని మహిళల సమస్యల పరిష్కారం, మహిళా సాధికారత దిశగా కమిషన్‌ను ఆమె విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






