తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ చైర్మెన్‌గా గద్వాల విజయలక్ష్మి.. సభ్యురాలిగా శ్రీకాంతచారి తల్లి!

by Ajay Maddhiboyina |

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మిని నియమించారు. అదే విధంగా కమిషన్ సభ్యులుగా చిట్యాల శ్వేత, శశికల, సదాలక్ష్మి, రాధ, షకీరాలతో పాటు శ్రీకాంత‌చారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ చైర్మెన్‌గా గద్వాల విజయలక్ష్మి.. సభ్యురాలిగా శ్రీకాంతచారి తల్లి!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మిని నియమించారు. అదే విధంగా కమిషన్ సభ్యులుగా చిట్యాల శ్వేత, శశికల, సదాలక్ష్మి, రాధ, షకీరాలతో పాటు శ్రీకాంత‌చారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్ ప‌ర్స‌న్, స‌భ్యులుగా నియ‌మించిన‌వారి ప‌ద‌వీకాలం ఏదేళ్ల పాటు ఉండ‌నుంది. ఇక ఇప్పటి వరకు మహిళా కమిషన్ చైన్ పర్సన్ గా నేరెళ్ల శారద ఉంన్నారు. ఆమెకంటే ముందు సునీత లక్ష్మారెడ్డి చైర్ పర్సన్ గా ఉన్నారు. మహిళా కమిషన్ మహిళల హక్కుల పరిరక్షణకై ఏర్పాటు చేశారు. లింగ సమానత్వం ప్రోత్సహించడం, వారికి జరిగే అన్యాయాలను విచారించడానికి ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మహిళా సాధికారత కోసం సైతం క‌మిష‌న్ ప‌నిచేస్తుంది. రాష్ట్రంలో మహిళా సమస్యల పరిశీలను ప‌రిశీలించ‌డం, ఫిర్యాదుల విచారణ, చట్టపరమైన సలహాలు సైతం ఇస్తుంది.

Next Story