- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gade Innaiah: గాదె ఇన్నయ్య తల్లి కన్నుమూత.. అంత్యక్రియలకు కొడుకు హజరయ్యేనా?
by Prasad Jukanti |
గాదె ఇన్నయ్య కుటుంబంలో విషాదం నెలకొంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య (Gade Innaiah) ఇంట విషాదం నెలకొంది.. ఇన్నయ్య తల్లి థెరిసమ్మ (Therisamma) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వయో భారం కారణంగా గత రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు రేపు (శనివారం) జరగనున్నాయి. గత ఏడాదిగా తల్లి దగ్గరే ఉంటున్న ఇన్నయ్య ఎన్ఐఏ కేసులో ఇటీవల అరెస్టు అయి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన తల్లి చివరి చూపుకైనా ప్రభుత్వం ఇన్నయ్యకు అవకాశం కల్పిస్తుందా లేదా అని అయన శ్రేయోభిలాషులు చర్చించుకుంటున్నారు. కాగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను ఉపా (UAPA) చట్టం కింద అరెస్టు చేశారు.
Next Story






