- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gade Innaiah: కాస్త నోరు అదుపులో పెట్టుకోండి.. సీఎం, మంత్రులపై గాదె ఇన్నయ్య ఫైర్
కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) పరిధిలోని 400 ఎకరాల భూ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో నిప్పులు రాజేసింది.

దిశ, వెబ్‌డెస్క్: కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) పరిధిలోని 400 ఎకరాల భూ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో నిప్పులు రాజేసింది. అయితే, ఆ భూముల్లో తదుపరి ఉత్తర్వులు (Further orders) వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ సుప్రీం కోర్టు (Supreme Court), తెలంగాణ సీఎస్ శాంతికుమారి (CS Shanti Kumari)ని ఆదేశించింది. మరోవైపు హెచ్‌సీయూ (HCU)లో విద్యార్థులు ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. దీంతో కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంపై వర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులతో సంప్రదింపులో జరిపేందుకు ప్రభుత్వం మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం (State Government)పై తెలంగాణ విప్లవకారుడు, తొలి దశ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య (Gade Innaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంచె గచ్చిబౌలి భూములపై వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు, మంత్రులు (Ministers) కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలకు అనుగుణంగా సర్కార్ నడుచుకోవాలని సూచించారు. హెచ్‌సీయూ (HCU) విద్యార్థుల పోరాటం ఎవరో ఉన్నారంటూ కామెంట్ చేయడం మూర్ఖత్వమేనని.. అనవసరంగా తప్పుగా మాట్లాడి పరువు తీసుకోవద్దంటూ గాదె ఇన్నయ్య హితవు పలికారు.






