పవన్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు వెన్నెల

by Prasad Jukanti |   (  Updated:2026-06-03 11:45:25  IST  )

తెలంగాణ నిన్న మా అయ్యల జాగీరు, ఇవాళ మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరు అని గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్‍కు కౌంటర్ ఇచ్చారు.

పవన్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు వెన్నెల
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గద్దరు కూతురు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు.. ఈ రోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు అన్నారు. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదని త్యాగాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం అని ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నామే తప్ప ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదన్నారు. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్కౌంటర్ చేశారని, ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారన్నారు. నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్‍ను అభిమానిస్తారని హాట్ కామెంట్స్ చేశారు.

గద్దర్‍పై పవన్ కీలక వ్యాఖ్యలు:

నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ గద్దర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ ఓ సారి తన వద్దకు వచ్చి తన వెన్నులో బుల్లెట్లు దిగిన కారణంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేసేందుకు ఇబ్బందిగా ఉందని తనను అడిగితే రెండు మూడు రోజుల్లో కారు కొని ఇచ్చానన్నారు. ఇవాళ నన్ను విమర్శిస్తున్న వారంతా గద్దర్ అన్న బతికుండగా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గద్దర్ అన్న విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకుంటామని అది నా వ్యక్తిగత విషయం అని పవన్ చెప్పారు. గద్దర్ అన్నపై నాకున్న ప్రేమ, గౌరవాన్ని తప్పకుండా చూపిస్తాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story