- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన.. 2024 ఉత్తమ చిత్రంగా ‘కల్కి’
మరికొద్దిసేపట్లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు (Gaddar Telangana Film Award)లను ప్రకటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు (Gaddar Telangana Film Award)లను ఇవాళ జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ (Jayasudha)తో పాటు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju), జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ దర్శకుడి అవార్డు కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను వరించింది.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (చిన్న కథ కాదు.. 35), ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ (ఫుష్ప-2), ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామి) స్పెషల్ జ్యూరీ అవార్టులను దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), అనన్య నాగళ్ల (పొట్టేల్), ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2), ఉత్తమ సహాయ నటుడిగా ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజూ యాదవ్) అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్టూరి (లక్కి భాస్కర్), ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్ (రజాకార్), ఉత్తమ హస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా గణేష్ ఆచార్య (దేవర), బెస్ట్ స్టోరీ రైటర్‌గా శివ పాలడుగు, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్నారు. అదేవిధంగా ఉత్తమ బాలల చిత్రంగా 35.. ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ చిత్రంగా ‘రజాకార్’, ఉత్తమ పుస్తకంగా రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం) అవార్టులను కైవసం చేసుకున్నాయి.
అవార్టుల ప్రకటన సందర్భంగా జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డులు తమకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు.
కాగా, 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు అంటే మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులను వెల్లడించారు. ప్రతి ఏడాది ఒక్కో ఉత్తమ చిత్రానికి.. 2024కు సంబంధించి మొత్తం 11 కేటగిరీలలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ (Urdu) చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా 21 మందికి వ్యక్తిగతంగా అవార్డులు వరించాయి. వాటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు (Special Jury Awards)లను కూడా ప్రకటించారు. సినీ ఇండస్ట్రీకి అమూల్య సేవలందించిన ఎన్టీఆర్ (NTR), పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు (Kantha Rao), రఘుపతి వెంకయ్య పేర్లతో స్పెషల్ అవార్డులను కూడా ప్రదానం చేయనున్నారు.






