Gaddar Last Movie: త్వరలో రిలీజ్.. ఇంతలోనే ఇలా!

by Vinod kumar |   (  Updated:2023-08-06 11:58:37  IST  )

ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు.

Gaddar Last Movie: త్వరలో రిలీజ్.. ఇంతలోనే ఇలా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన పాటలతో అలరిస్తున్న గద్దర్.. కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఈ మధ్య ఓ మూవీలో నటించారు. ఇప్పుడది ఆయనకు చివర సినిమా అయింది. ఇలా అకస్మాత్తుగా గద్దర్ చనిపోవడంతో ఆ సినిమా ఏంటి? దాని డీటైల్స్ చర్చనీయాంశంగా మారింది.

సత్యారెడ్డి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తీస్తున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది.ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇందులో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఈయనతో పాటు గోరేటి వెంకన్న, సుద్దాల అకోశ్ తేజ తదితరులు ఈ చిత్రం కోసం పాటలు రాశారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్ని త్వరలో వైజాగ్‌లోని ఆర‍్కే బీచ్‌లో నిర్వహిస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఓ ప్రముఖ వ్యక్తి ఈ వేడుకకు హాజరవుతారని అన్నారు. ఇలా అందరూ సినిమా హడావుడిలో ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా గద్దర్ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ‍్యంలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే గద్దర్ లాంటి వ్యక్తి ఇలా మనకు దూరమవడం బాధకరమైన విషయం.

Read More..

చివరి క్షణంలో కూడా ఐసీయూలో పాట పాడిన గద్దర్..!

‘గుండెకు గాయమయ్యింది’.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ చివరి సందేశం

Next Story