- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Gaddar Film Awards 2024: జ్యోతి ప్రజ్వలన చేసిన డిప్యూటీ CM భట్టి
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే.. పలువురు సినీ ప్రముఖులు హైటెక్స్‌కు చేరుకోగా.. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపట్లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సుకుమార్, నాగ్‌అశ్విన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, పదేళ్ల తర్వాత గద్దర్ పేరుతో ఫిల్మ్ అవార్డులు ఇవ్వనుండడంతో ఈ కార్యకమానికి ప్రభుత్వం తరపున పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.






