- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. ఇన్విటేషన్‌లో గద్దర్ ఫోటో మిస్సింగ్! సర్వత్రా విమర్శలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు రేపు (శనివారం) జరగనున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న (Gaddar Film Awards Ceremony) గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు రేపు (శనివారం) జరగనున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్-4 లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సహా ప్రముఖులు ఈ వేడుకలకు హజరుకానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత గద్దర్ పేరిట ఇటీవల సినీ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు ఎన్నికైన ఒక్కో ఉత్తమ చిత్రానికి ఉత్తమ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లు మొత్తం నాలుగు అవార్డులు అందుకోనున్నారు. ఇక 2024కు సంబంధించి అన్ని కేటగిరీలకు చెందిన అవార్డులు ఉంటాయి.
ఇప్పటికే అందరికీ ఆహ్వాన పత్రికలు అందించినట్లు సమాచారం. హైటెక్స్‌లో వేడుకలకు తుది ఏర్పాట్లు జరుతున్నాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించ తలపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, అవార్డుల ఇన్విటేషన్‌లో మాత్రం గద్దర్ ఫోటో లేకపోవడం గమనార్హం. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇన్విటేషన్‌కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇన్విటేషన్‌లో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాత్రమే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం లోగో, అవార్డు లోగో ఉన్నాయి. ఇన్విటేషన్‌లో మాత్రం గద్దర్ ఫోటో లేదు.
ఈ ఫోటో మిస్సింగ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. ప్రజా గాయకుడు గద్దర్‌ని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్ వారి పేరు మీద ఇస్తున్నటువంటి సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరమన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలో నైనా వారి చిత్రపటాన్ని పెట్టి వారిని గౌరవించాలని ఈ సందర్భంగా కోరారు.






