గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకే కేటాయించాలి

by Naga Rani Yarlagadda |

తమ గచ్చిబౌలి భాగ్యనగర్ టీఎన్​జీఓస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటికి కేటాయించిన స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారని గత ఉత్తర్వుల మేరకు..

గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకే కేటాయించాలి
X
  • సీఎస్‌కు టీఎన్జీవో కేంద్ర సంఘం వినతి

దిశ, తెలంగాణ బ్యూరో: తమ గచ్చిబౌలి భాగ్యనగర్ టీఎన్​జీఓస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటికి కేటాయించిన స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారని గత ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం వెంటనే ఆ స్థలాలను బీటీ టీఎన్జీఓస్​సొసైటీకి కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు, సీఎం స్పెషల్​సెక్రటరీ శేషాద్రిలను కలిసి విజ్ఞప్తి చేసినట్లు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఏం. హుస్సేని ముజీబ్ లు తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే తగు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు టీఎన్జీవో సంఘం పక్షాన ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సుమారు 4 వేల మంది రిటైర్ ఉద్యోగులు, సర్వీసులో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆ స్థలాలను వారికే కేటాయించాలని సీఎస్​కు విన్నవించినట్లు వారు తెలిపారు.

Next Story