ICUలో ‘గబ్బర్ సింగ్’ నటుడు.. సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబసభ్యులు

by Gantepaka Srikanth |

గబ్బర్ సింగ్, ఆది, మిరపకాయ్, దిల్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) ప్రస్తుతం పుట్టెడు కష్టాల్లో ఉన్నారు.

ICUలో ‘గబ్బర్ సింగ్’ నటుడు.. సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబసభ్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: గబ్బర్ సింగ్, ఆది, మిరపకాయ్, దిల్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) ప్రస్తుతం పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన రెండు కిడ్నీలు క్షీణించడంతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వెంకట్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. చికిత్స ఖర్చులు భరించలేకపోతున్నాం.. దయచేసి తమకు హెల్ప్ చేయండంటూ దాతల సహాయం కోరుతున్నారు. మీడియా ద్వారా "దయచేసి మా ఫ్యామిలీని ఆదుకోండి" అంటూ ప్రజలకు, సినీ ప్రముఖులకు వేడుకుంటున్నారు. కాగా, గతంలో ఫిష్ వెంకట్‌కు అనారోగ్యం అని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. చివరగా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో ఫిష్ వెంకట్ కనిపించారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

Next Story