TG News : తెలంగాణ ప్రధాన సమాచార కమిషనర్ గా జి. చంద్రశేఖర్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌(Telangana Chief Information Commissioner)గా సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి జి. చంద్రశేఖర్ రెడ్డి(G. Chandrashekhar Reddy) నియమితులయ్యారు.

TG News : తెలంగాణ ప్రధాన సమాచార కమిషనర్ గా జి. చంద్రశేఖర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌(Telangana Chief Information Commissioner)గా సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి జి. చంద్రశేఖర్ రెడ్డి(G. Chandrashekhar Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) ఆమోదంతో రాష్ట్ర సర్కార్(Telangana Govt) ఈ నియామక ఉత్తర్వులను జారీ చేసింది. సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ రెడ్డి అడవులు, పర్యావరణ రంగంలో అపూర్వ అనుభవం ఉన్న అధికారి. ప్రభుత్వ శాఖలు పారదర్శకంగా పనిచేసేలా, ప్రజలు అడిగిన సమాచారం సకాలంలో ఇచ్చేలా చూసే బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తారనే నమ్మకంతో సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనను ఈ కీలక శాఖకు కమిషనర్‌ గా నియమించినట్టు తెలుస్తోంది.

Next Story