ఫ్యూచర్ యువ లీడర్ సూర్యాంశ్: కేటీఆర్

by Elthuri vijay kumar |

చిన్నారిని ఆశీర్వదించి పేరు పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఫ్యూచర్ యువ లీడర్ సూర్యాంశ్: కేటీఆర్
X

ఫ్యూచర్ యువ లీడర్ సూర్యాంశ్: కేటీఆర్

- కుమారుడికి నామకరణం చేయాలని కేటీఆర్ ను కలిసి కోరిన అన్నపురెడ్డిపల్లి మాజీ జెడ్పీటీసీ దంపతులు

- చిన్నారిని ఆశీర్వదించి పేరు పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

దిశ అన్నపురెడ్డిపల్లి: రాజకీయ భక్తి అంటే ఏదో ఒక నాయకుడు పొగడటం.. ఆ నాయకుడు మెచ్చుకునే పనులు చేయడం సహజం. కానీ పుట్టిన కుమారుడికి ఆ నాయకుడి చేత నామకరణం చేయించుకోవడం అనేది ఈ రోజుల్లో చూడలేదు. నాడు తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని రాజ భక్తి చాటుకొని పేరు పెట్టుకున్నారు. అదే తారక రామారావు తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత నూతన మండలం అయిన అన్నపురెడ్డిపల్లి మాజీ జెడ్పీటీసీ భారత లావణ్య, రాంబాబు దంపతులకు కుమారుడు జన్మించడంతో వారు నేరుగా కేటీఆర్ ఇంటికి వెళ్ళి మా కుమారుడికి ‘సు’ అనే అక్షరం వచ్చే విధంగా నామకరణం చేయాలని కోరగా.. ‘నా కుమారుడి పేరు హిమాన్షు.. మీ కుమారుడి పేరు సూర్యాంశ్.. ఇద్దరు రానున్న కాలంలో డైనమిక్ లీడర్లు కావాలని ఆ చిన్నారిని ఆశీర్వదించారు. నూతన మండలం తొలి జెడ్పీటీసీగా మండల ప్రజల అభిమానాన్ని పొంది నేడు అదే పార్టీలో ఉండి పార్టీ చిన్న బాస్ తో భారత లావణ్య, రాంబాబు దంపతలు వారి కుమారుడికి నామకరణం చేయించుకోవడంతో అశ్వారావుపేట నియోజక వర్గ మాజీ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు, మండల ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, పగడాల నాగరాజు, గెల్లు శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజు, క్యామ్ మల్లేశం పలువురు పాల్గొన్నారు.

Next Story