- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాబోయే సీఎస్ రామకృష్ణారావు
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary Telangana Government)గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు (Rama Krishna Rao) నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 1991 ఐఏఎస్‌కు బ్యాచ్చెందిన రామకృష్ణా రావు తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ (Department of Finance)లో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖలో చేసిన సేవలను గుర్తించిన సర్కార్ అనుభవం దృష్ట్యా రామకృష్ణా రావును సీఎస్‌గా నియమించింది. ఆయన గతంలో నల్లగొండ (Nalgonda) జాయింట్కలెక్టర్గా, గుంటూరు (Guntur) జిల్లా కలెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు.






