పదేళ్లు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీనీ న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

by Malleboina Mahesh |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేటలో పునాది రాయి వేశారు.

పదేళ్లు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీనీ న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఈ రోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (Future City Development Authority)కి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేటలో పునాది రాయి (foundation stone) వేశారు. అలాగే రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 (Greenfield Radial Road-1) నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విజయదశమి రాష్ట్ర ప్రజలకు అన్ని విజయాలను చేకూరుస్తుందని అన్నారు. అలాగే చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, ఫ్యూచర్ సిటీ (Future City) లో తనకు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని, తనకు ఎటువంటి భూములు ఉన్నా అందరికీ కనిపిస్తాయని దాచిపెడితే దాగవని అన్నారు. కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, వైఎస్సార్, చంద్రబాబు దాన్ని కొనసాగించారు.

ఆ నాయకులు ఆలోచన చేశారు కాబట్టే ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నామని, వారు మనకెందుకులే అనుకుంటే ఓఆర్ఆర్, శంషాబాద్, హైటెక్ సిటీ వచ్చేవి కాదని ఈ సందర్భంగా సీఎం రేవత్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే తనకు పదేళ్లు అవకాశం ఇస్తే.. న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తానని, న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తానని అన్నారు. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నామని, ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామని, అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ (Bullet train) వస్తుందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని, కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోవొద్దని, అందరిని ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Next Story