‘‘బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ మొత్తం ఇప్పుడు ఒకటే గుసగుస’’.. డబ్బు పంపిణీపై ఫన్నీ ట్రోల్స్..!

by Satheesh |   (  Updated:2023-11-29 16:33:36  IST  )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. ఎలక్షన్ సంఘం అధికారులు పోలింగ్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్రంలోని 119

‘‘బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ మొత్తం ఇప్పుడు ఒకటే గుసగుస’’.. డబ్బు పంపిణీపై ఫన్నీ ట్రోల్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. ఎలక్షన్ సంఘం అధికారులు పోలింగ్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలో అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలు పంచుతున్నారు. ప్రత్యర్థితో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఓటుకు రూ. 5 వేలు కొన్ని చోట్ల రూ.10 వేలు ఇవ్వడానికి కూడా అభ్యర్థులు వెనక్కితగ్గడం లేదని టాక్. ఇక, రేపు ఉదయం పోలింగ్ జరగనుండంటంతో ఇవాళ రాత్రి రాష్ట్రవ్యాప్తంగా డబ్బు, మద్యం పంపిణీ జోరుగా పంపిణీ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఓటర్లకు డబ్బు పంపిణీపై సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఫన్నీ ఫన్నీ కామెంట్లతో చేస్తున్న ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ మొత్తం ఒకటే గుసగుస. ఏమైంది మీకు వచ్చినయ. ఇంకా రాలేదా.. అయ్యో ఎట్ల మరి. ఇస్తర ఇయ్యరా అసలు’’ అంటూ డబ్బులు పంపిణీపై జోకులు వేస్తున్నారు. ‘‘మీ దగ్గర ఎంత ఇచ్చారు. అవునా మా దగ్గర తక్కువ ఇచ్చారుగా’’, ‘‘ఆ పార్టీలు వాళ్లు నీకు ఎంత ఇచ్చారు.. అదేంటి మరీ మాకు తక్కువ ఇచ్చారు’’, ‘‘ఓట్ల పుణ్యామా అని.. ఎన్నో రోజుల గోవా ట్రిప్ కల తీరింది’’ ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇవే స్టేటస్‌లు, పోస్టులు దర్శనమిస్తున్నాయి.

Next Story