కేబినెట్ నిర్ణయాల మేరకే నిధులు విడుదల చేశా.. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-06 07:43:21  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ న్యాయ విచారణ ముగిసింది.

కేబినెట్ నిర్ణయాల మేరకే నిధులు విడుదల చేశా.. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ న్యాయ విచారణ ముగిసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ఇవాళ ఉదయం జస్టిస్‌ పీసీ చంద్రఘోష్ కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. అయితే, విచారణ భాగంగా ఆర్థిక అంశాలపై ఆయనను క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎడీఎస్‌ఏ (NDSA) ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు ప్రశ్నలు అడిగనట్లుగా సమాచారం. ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికెట్, నిధులు, బ్యాంక్ గ్యారంటీల విడుదలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

కాగా, సుమారు గంట పాటు కొనసాగిన బహిరంగ విచారణలో వారు అడిగన ప్రశ్నలకు ఈటల సమాధానం చెప్పారు. కేబినెట్ నిర్ణయాల మేరకే నిధులు విడుదల చేశానని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయని.. ఇందులో తన సొంత నిర్ణయాలు లేవని చెప్పారని సమాచారం. అదేవిధంగా ప్రాజెక్ట్‌లకు సంబంధించి సాంకేతిక అంశాలు తనకు తెలియదని కమిషన్‌కు తెలిపారని తెలుస్తోంది. కాళేశ్వరంతో పాటు అనుబంధం ప్రాజెక్టుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు డాక్యుమెంట్లను ఈటల రాజేందర్ కమిషన్‌కు అందజేశారు.

కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే..

* మూడు బ్యారేజీలు నిర్మించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించగా.. అది టెక్నికల్ టీమ్, కేబినెట్ తీసుకున్న నిర్ణయం అని ఈటల సమాధానం ఇచ్చారు.

* తుమ్మడిహట్టి కాదని మేడిగడ్డకు బ్యారేజీ నిర్మాణాన్ని ఎందుకు మార్చారని అడగ్గా.. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర జల వనరుల శాఖ అభ్యంతరం చెప్పారని ఈటల రిప్లై ఇచ్చారు.

* కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఎర్పాటు చేశారని ప్రశ్నించగా.. నిధుల వెసులుబాటుతో పాటు ప్రాజెక్ట్ వేగవంతం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమీకరించామని ఎంపీ తెలిపారు.

* బ్యారేజీ నిర్మాణాల్లో ఆర్థిక క్రమశిక్షణ లేదా..? అని కమిషన్ ప్రశ్నించగా.. అప్పుడున్న పరిస్థితుల్లో కేబినెట్ ఆదేశాలను ఆర్థిక శాఖ అనురించిందని ఈటల సమాధానం ఇచ్చారు.

Next Story