- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mamnoor Airport: నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు
by Gantepaka Srikanth |
మామునూరు ఎయిర్‌పోర్టు(Mamnoor Airport) నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మామునూరు ఎయిర్‌పోర్టు(Mamnoor Airport) నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాదాపు రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.కోటి 20లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించింది. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించడంతో భూ బాధితుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. గత నెల రోజులుగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఖిలావరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు సఫలీకృతులయ్యారు.
Next Story






