త్వరలో స్థానిక ఎన్నికలు.. పథకాలకు నిధుల వరద

by Muthe.Rajitha |

రాష్ట్రంలో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వివిధ పథకాలకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.

త్వరలో స్థానిక ఎన్నికలు.. పథకాలకు నిధుల వరద
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వివిధ పథకాలకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. సన్నధాన్యం రైతులకు బోనస్, మహాలక్ష్మి ఎల్పీజీ పథకం, మైనారిటీ సంక్షేమ శాఖలకు కలిపి మొత్తం రూ.480 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో సన్నవడ్ల బోనస్‌కు రూ.200 కోట్లు, మహిళలకు రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు అందించే మహాలక్ష్మి పథకానికి రూ.60 కోట్లు విడుదల చేయగా... మైనారిటీ విద్య, ఉపాధి, ఆర్థిక సాయం పథకాలకు రూ.220 కోట్లు కేటాయించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లి ఓట్లు పొందేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Next Story