- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు సంపూర్ణ మద్దతు : జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
పాత పెన్షన్ స్కీమ్ సాధనే లక్ష్యంగా తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పాత పెన్షన్ స్కీమ్ సాధనే లక్ష్యంగా తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. పాత పెన్షన్ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒకే గొడుగు కిందకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. లచ్చిరెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ అత్యవసర సమావేశం 37ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్ పెన్షన్ అంతమే జేఏసీ పంతం అని అన్నారు.
కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఆత్మగౌరవ సభకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరుపున, జేఏసీ అనుబంధ సంఘాల తరుపున ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాత పెన్షన్ స్థానంలో సీపీఎస్ పెన్షన్ తీసుకువచ్చిన ప్రభుత్వం, తాజాగా యూపీఎస్ పెన్షన్ స్కీమ్ ను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వం పరోక్షంగా సీపీఎస్ పెన్షన్ స్కీమ్ లో లోపాలు ఉన్నాయని ఒప్పుకుందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరం గట్టిగా పోరాడితే మళ్ళీ పాత పెన్షన్ విధానం అమలులోకి వస్తుందని లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎవరు ప్రయత్నం చేసినా జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు వేల సంఖ్యలో ఉద్యోగులు తరలి రావాలని లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ
ఉద్యోగుల సంక్షేమం, భద్రత ప్రభుత్వం బాధ్యత అని తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు దర్శన్ గౌడ్ అన్నారు. రాత్రి పగలు అనకుండా ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీపీఎస్ రద్దు కోసం వి. లచ్చిరెడ్డి సారధ్యంలోని తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో కలిసి ఒపీఎస్ పెన్షన్ సాధనే లక్ష్యంగా సైనికులుగా పోరాడుతామన్నారు. తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో తక్కువ సమయంలోనే 33 జిల్లాలో ముఖాముఖి సభలను నిర్వహించడం జరిగిందన్నారు.
సమావేశంలో జేఏసీ కో- ఛైర్మన్లు కె. రామకృష్ణ(తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం), ఎస్. రాములు (తెలంగాణ తహసీల్దార్ల సంఘం), కె.హన్మంత్ రావు (తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) దేవేందర్ (తెలంగాణ కమర్షియల్ టాక్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), జి.కృపాకర్ (తెలంగాణ వ్యవసాయ అధికారుల అసోసియేషన్), కె. రాములు(తెలంగాణ అగ్రికల్చర్ డాక్టర్ల అసోసియేషన్), బాణాల రాంరెడ్డి(తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ ఎస్ ఏ, డా.జి. నిర్మల(తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ), అశ్వధామారెడ్డి (తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎల్. దర్శన్ గౌడ్(తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల యూనియన్), డా. కత్తి జనార్ధన్ (తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్), హబీబ్ మస్తాన్(తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం), గరికే ఉపేందర్ రావు (తెలంగాణ జీపీఓ) ల అసోసియేషన్), ఎస్.వి. సుబ్బయ్య (తెలంగాణ న్యాయ విభాగ ఉద్యోగుల సంఘం), మహిపాల్ రెడ్డి(సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ), ఊదరి గోపాల్( జీహెచ్ఎంసీ) ఉద్యోగుల యూనియన్), పీహెచ్. రవి (తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ (డిఆర్) సంఘం), ఎస్. నర్సింలు(రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, రొక్కం దేవిక (తెలంగాణ వైద్య, ఆరోగ్య మహిళా ఉద్యోగుల సంఘం), బి. సుదర్శన్ గౌడ్ (తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీ అధికారుల సంఘం), ఎం. చంద్ర శేఖర్ గౌడ్( టీజీ బీసీ ఉపాధ్యాయ సంఘం), కొంగల వెంకట్(ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), కె. సాయిరెడ్డి (తెలంగాణ వైద్య, పబ్లిక్ హెల్త్ ఉద్యోగుల యూనియన్ , పి. లక్ష్మయ్య (తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ), ఎస్. నర్సింలు (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, ఆవుల సైదులు (తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఉద్యోగులు, టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్, శిరందాసు రాందాస్ (ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం, డా. రామకృష్ణ (తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘం), ఎస్. హరికిషన్ గిరిజన ఉపాధ్యాయుల సంఘం, కె. సందీప్ కుమార్ (తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల సంఘం), మహమ్మద్ మోహినుద్దిన్(మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఆర్. కిరణ్ కుమార్(టెక్నికల్ ఎడ్యుకేషన్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం), శ్రీకాంత్ (తెలంగాణ పంచాయితీ కార్యదర్శుల సంఘం), హేమలత (తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఉద్యోగుల సంఘం), జి. మహేష్ కుమార్ (తెలంగాణ సీడ్ కార్పొరేషన్ అసోసియేషన్), సుగంధిని, ఎస్. వివేక్(స్పౌస్ ఫోరం), సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షులు రాంబాబు, సీసీఎల్ఏ యూనిట్ ప్రధాన కార్యదర్శి, చైతన్య క్రిష్ణ, సీసీఎల్ఏ రాష్ట్ర కోశాధికారి మల్లేశం, టీజీసీపీఎస్ఈయు రాష్ట్ర సహ అధ్యక్షులు రాందాస్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శోభన్, రాష్ట్ర బాధ్యులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.






