హైదరాబాద్‌లో కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ కొరత.. కిలోమీటర్ల మేర వాహనాలు

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతోంది. బంకుల వద్ద భారీ క్యూలు, వాహనదారుల నిరసనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ కొరత.. కిలోమీటర్ల మేర వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నగరంలో ఇంధన కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా నగరంలోని అనేక పెట్రోల్‌ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెజారిటీ బంకుల వద్ద 'నో స్టాక్' (No Stock) బోర్డులు దర్శనమిస్తుండగా, పెట్రోల్ అందుబాటులో ఉన్న చోట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి.

ముఖ్యంగా చంపాపేట్‌, ఐఎస్‌ సదన్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గంటల తరబడి క్యూలో నిల్చున్నా పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు బంకుల వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు.. బంకుల వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంధనం కోసం గంటలతరబడి వెయిట్ చేయాల్సి రావడంతో ఉద్యోగులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Next Story