- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై సింగరేణిలో ప్లాస్టిక్ వినియోగంపై సంపూర్ణ నిషేధం : సీఎండీ ఎన్.బలరామ్
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా “ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుదాం” అనే నినాదం తీసుకున్నారని, దీనిని అనుసరిస్తూ సింగరేణి హైదరాబాద్ కార్యాలయం తో పాటు సింగరేణి లోని అన్ని ఏరియాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా “ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుదాం” అనే నినాదం తీసుకున్నారని, దీనిని అనుసరిస్తూ సింగరేణి హైదరాబాద్ కార్యాలయం తో పాటు సింగరేణి లోని అన్ని ఏరియాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధిస్తున్నట్లు సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టింగ్ బాటిళ్లను మొత్తానికే వినియోగించొద్దని స్పష్టం చేశారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి తన సందేశం ఇచ్చారు.
సింగరేణి సంస్థలో ఇప్పటికే పలు రకాల పర్యావరణహిత చర్యలు చేపడుతున్నామని, కొన్నిచోట్ల ప్లాస్టిక్ ను వాడటం మానేశారని అయినప్పటికీ ఈ ఏడాది ఇచ్చిన ప్రపంచ పర్యావరణ నినాదాన్ని అనుసరించి సింగరేణి కార్యాలయాలు, గనులు, డిపార్ట్ మెంటులలో ప్లాస్టిక్ తో తయారు చేసిన బాటిల్స్, ప్లేట్లు, వస్తువులు తదితరాలపై ఇక సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలోని అధికారులు, కార్మికులు, ఉద్యోగులు దీనికి సహకరించాలని
సీఎండీ బలరాం కోరారు. తమ ఇంటి వద్ద కూడా ప్లాస్టిక్ వాడకాలను తగ్గించాలని సూచించారు. పర్యావరణం పట్ల అభిమానంతో తాను ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా 19 వేల మొక్కల్ని నాటానని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని సంస్థ డైరెక్టర్లు, ఇతర కార్మికులు కూడా మొక్కలు నాటడం ప్రారంభించారని ఇది ఎంతో సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటాలని, అటువంటి ఆసక్తి గల వారికి సింగరేణి సంస్థ ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తుందని తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం సింగరేణి ప్రాంతాల్లో ఎండాకాలం 50 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండేవని, సింగరేణి సంస్థ విస్తారంగా మొక్కలు నాటిన కారణంగా, ఆ మొక్కలు అడవులుగా పెరిగి వాతావరణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పడిపోయాయని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ కు ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని ఉన్న అంగుల్ ప్రాంతంలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు స్థానికులు తెలియజేశారని చెప్పారు కనుక అక్కడ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి సింగరేణి సంస్థ సంసిద్ధమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్ ) ఎస్ డీ ఎం. సుభాని, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ ) ఎన్.వి. రాజశేఖర్ రావు, ఇంకా వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పర్యావరణం పై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన వారికి ఛైర్మన్ బహుమతుల్ని అందజేశారు.
- Tags
- SCCL
- CMD Balaram






