- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక నుంచి బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ ఉత్సవాలు.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
ఇక నుంచి బతుకమ్మ ఉత్సవాలు బతుకమ్మ కుంటలోనే జరుగుతాయని, వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) హామీ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఇక నుంచి బతుకమ్మ ఉత్సవాలు బతుకమ్మ కుంటలోనే జరుగుతాయని, వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) హామీ ఇచ్చారు. అంబర్ పేట మండలం (Amberpeta Mandal) బాగ్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంట (Bathukamma Kunta) అభివృద్ధి పనులకు కలిగిన ఆటంకం మంగళవారం సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో పరిష్కారమైంది. దీంతో బుధవారం హైడ్రా కమిషనర్ బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను (Bathukamma Kunta Devolopement Works) ప్రారంభించారు.
స్థానికుల సమక్షంలో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు వేద మంత్రాలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమైందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి పనులు పూర్తి అవుతాయని, ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఇక్కడే జరుపుకోవచ్చని చెప్పారు. అంతేగాక ఈ చెరువును పునరుద్ధరిస్తే పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారుతాయని అన్నారు. చెరువు అభివృద్ధి పనులకు స్థానికులు సహకరించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్దఎత్తున హాజరయ్యారు. అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని స్థానికులు కమిషనర్‌కు హామీ ఇచ్చారు.






