- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామాల్లో కొత్త వెలుగులు.. ప్రగతిపథంలో పల్లెలు
రెండు సంవత్సరాల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకొచ్చే..

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు సంవత్సరాల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకొచ్చే పలు కీలక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నుంచి మహిళా ఆర్థిక సాధికారత వరకు సమన్వయం, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనతో మంత్రి సీతక్క నేతృత్వంలో ఈ శాఖ స్థిరమైన ఫలితాలను అందించింది. గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, మౌలిక వసతుల అభివృద్ధి మూడు ప్రధాన లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు సాగుతోంది.
రహదారులతో కొత్తరూపు
హ్యామ్ (హైబ్రిడ్ హన్యునిటి మోడల్) కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా 7,449 కి.మీ గ్రామీణ రహదారుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం కోసం రూ.16,007 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చి, మొత్తం 17 ప్యాకేజీలకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. పీఎంజీఎస్‌వై కార్యక్రమం కింద రెండు సంవత్సరాల్లో 201 కి.మీ రహదారులు, 34 వంతెనల నిర్మాణం పూర్తి కాగా, మొత్తం రూ.455 కోట్లు వెచ్చించారు. పీఎం–జన్‌మాన్ కింద 67 కి.మీ పొడవైన 25 రహదారి పనులను రూ.67 కోట్ల వ్యయంతో కొనసాగుతున్నాయి. సీఆర్ఆర్ కార్యక్రమం పరిధిలో మొత్తం 2,163 పనులకు రూ.4,175 కోట్ల అంచనాతో చేపడుతున్నారు. డిసెంబర్ 2023 నుంచి కొత్తగా 1,121 పనులకు రూ.2710 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చి, ఇప్పటి వరకు 600 కి.మీ రహదారులు పూర్తిచేశారు. ఈ పనులకు రూ.570 కోట్లు ఖర్చు అయ్యింది. ఎంఆర్ఆర్ కార్యక్రమం కింద మొత్తం 2,861 పనులకు రూ.3,347 కోట్ల అంచనా వ్యయంతో చర్యలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2023 నుంచి కొత్తగా 1,059 పనులకు రూ.1,558 కోట్ల పరిపాలనా అనుమతి లభించగా, ఈ వ్యవధిలో 180 కి.మీ రహదారులు పూర్తిచేసి రూ.452 కోట్లు వెచ్చించారు. క్రీడా కోటా కింద 171 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించడం ద్వారా యువతకు అవకాశాలు కల్పించారు. జీవో 317తో ఇబ్బంది పడ్డ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటేషన్ విధానంలో సౌలభ్యం కల్పించి, వారి సేవలను కొనసాగేలా చూసింది. 92 వేల కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు సమయానికి చెల్లించడం ద్వారా గ్రామీణ సేవా వ్యవస్థలో స్థిరత్వం వచ్చింది.
పరిశుభ్రమైన పల్లెలు
గ్రామాలను పచ్చగా, శుభ్రంగా, ఆరోగ్యంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం విస్తృత ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ‘స్వచ్చదనం – పచ్చదనం’ కార్యక్రమాన్ని రెండు సార్లు విజయవంతంగా నిర్వహించింది. ప్రతి ఏడాది నిర్వహించే ‘పనుల జాతర’ ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధి రెండూ కలిసేలా చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.4,529 కోట్లు, 2025–26లో రూ.2,198 కోట్లు ఖర్చుతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసింది.
నీటి సంరక్షణలో దేశానికే ఆదర్శం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జల్ సంచయ్ – జన భాగీదారీ’ పథకంలో తెలంగాణ అద్భుత ఫలితాలను సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,61,370 నీటి సంరక్షణ పనులు పూర్తి చేసి దేశంలో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తరుపున డైరెక్టర్ జి.సృజన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. పలు జిల్లాలు తమ కృషికి గుర్తింపుగా రూ.10 కోట్ల వరకు జాతీయ స్థాయి నగదు పురస్కారాలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణకు గర్వకారణమయ్యాయి.
స్వావలంబన నుంచి సంపద సృష్టి దిశగా
‘కోటిమంది మహిళలను కోటిశ్వరులుగా చేయాలి’ అన్న ధ్యేయంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లకు పైగా బ్యాంక్ రుణాలు అందిస్తోంది. రూ.1300 కోట్లకు పైగా వడ్డీ మాఫీ, రూ.10 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లోన్ బీమా వంటి సరికొత్త పథకాలతో మహిళా సంఘాలు మరింత బలోపేతం అవుతున్నాయి. దివ్యాంగ మహిళలు, కిశోర బాలికల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేశారు.
మహిళా సంఘాలు.. రూ.కోట్లలో వ్యాపారాలు
ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, ప్లాంట్లు ఏర్పాట్లు, ఫిష్ ట్రక్కులు, ఇందిరా క్యాంటీన్లు నిర్వహిస్తూ రూ.కోట్లలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ మహిళా ఉత్పత్తులకు రాష్ట్ర స్థాయి వేదికగా మారింది. తొలిసారి 65 లక్షల ఎస్‌హెచ్‌జీ సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేశారు. రూ.110 కోట్లతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నారు.
కోటి మంది మహిళలకు చీరలు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీని ప్రారంభించారు. 5 రోజుల్లోనే 43 లక్షల చీరలను పంపిణీ చేశారు. 2 లక్షల మంది మహిళలకు నూతనంగా సభ్యత్వం ఇచ్చి మరీ చీరలను పంపిణీ చేశారు. చీరల తయారీలో చేనేత కార్మికుల శ్రమకు చక్కటి ప్రోత్సాహం లభించింది.






