బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి..! ఫుల్ క్లారిటీ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-15 04:28:37  IST  )

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి..! ఫుల్ క్లారిటీ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గత 10 రోజులుగా ఆయ బీజేపీ (BJP)లో చేరబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా కోడై కూస్తోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) బాటలోనే ఆయన కూడా కమలం కండువా కప్పుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా (Social Media)లో ఆయన పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఓ సంచలన వీడియో విడుదల చేశారు.

అయితే, ఆ వీడియో పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన సోషల్ మీడియా పెయిడ్ చానళ్లు తాను పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరు, ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నందునే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాండూరు (Tandur) ప్రజలతో పాటు బీఆర్ఎస్ (BRS) నాయకులు, కార్యకర్తలు అలాంటి వార్తలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. తాను పార్టీ మారుతున్నాననే విషయంలో వాస్తవం లేదని అన్నారు. తానే గువ్వల బాలరాజును బీజేపీలోకి పంపానని.. మరికొంత మంది ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీలోకి తీసుకెళ్లడంలో సుత్రధారి తనే అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. గతంలో రూ.వందల కోట్లతో పాటు రూ.వేల కోట్ల కాంట్రాక్టులు, ఉన్నత పదువులు ఇస్తామని చెప్పి గతంలో బీజేపీ తనకు ఆశ చూపిందని అన్నారు. కానీ, తాండూరు ప్రజలకు అన్యాయం చేయకూదనే ఉద్దేశంతో నాడు ఆ పార్టీలో చేరలేదని గుర్తు చేశారు. తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాతో పాటు పలు పెయిడ్ చానళ్లు ఇక నుంచి అయినా తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజా సమస్యలతో పాటు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలపై నిలదీయాలని పైలట్ రోహిత్ రెడ్డి హితవు పలికారు.

Next Story