ఆ దేశ అధ్యక్షుడిని పొట్టుపొట్టుగా కొట్టిన భార్య.. ఫ్లైట్‌లో అధికారుల ముందే..

by Bhoopathi Nagaiah |

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఏదో గొప్ప పని చేసినందుకు అనుకునేరు.. అస్సలు కాదు..

ఆ దేశ అధ్యక్షుడిని పొట్టుపొట్టుగా కొట్టిన భార్య.. ఫ్లైట్‌లో అధికారుల ముందే..
X

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఏదో గొప్ప పని చేసినందుకు అనుకునేరు.. అస్సలు కాదు.. ఆయన భార్య బ్రిజిట్ మాక్రాన్‌ను చెంపదెబ్బ కొట్టింది. ఈనెల 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వియత్నాంలోని హనోయిలో విమానం నుంచి దిగుతుండగా బ్రిజిట్ తన చేతులతో మాక్రాన్ ముఖాన్ని నెట్టడం, చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో, వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర చేస్తున్నారని పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నల్లికుట్ల, వెన్నుపోటు రాజకీయాలు చేయనని, ఏదైనా సరే డేర్‌గా మాట్లాడతానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలని కుట్ర జరుగుతోందని, తాను జైలులో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన రాగా తాను గట్టిగా వ్యతిరేకించానని చెప్పారు. తాను పార్టీలో ఉంటే విలీనం కుదరదనే నన్ను కేసీఆర్‌ను విడదీయాలని కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. తనను పార్టీకి దూరం చేస్తే ఎవరికి లాభమో అర్థం చేసుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే దమ్ము ఎవరికీ లేదన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో ఆవిర్భవించిన టీడీపీ, చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story