- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ ప్రాంగణంలోనే 500 మందికి పైగా టెస్టులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(టీజీ ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో శాసనసభ, శాసనమండలి ప్రాంగణంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(టీజీ ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో శాసనసభ, శాసనమండలి ప్రాంగణంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు డీజీ స్వాతి లక్రా ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ఇలాంటి వైద్య శిబిరాలు వారి శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు.
వీరిలో అసెంబ్లీ పోలీస్ సిబ్బంది, అసెంబ్లీ సిబ్బందితో పాటు పబ్లిక్ గార్డెన్స్‌కు వచ్చే వాకర్స్ కూడా ఉన్నారు. శిబిరంలో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడంతో పాటు, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ప్రజా పాలనలో భాగంగా కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, ప్రభుత్వ యంత్రాంగం, సామాన్య ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి, అసెంబ్లీ ప్రాంగణంలోనే ఇటువంటి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినందుకు సిబ్బంది, వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం విజయవంతం కోసం కృషిచేసిన వారిలో టీజీ ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పి.తిరుపతి, ఇన్ స్పెక్టర్ ఎం భాస్కర్, హెడ్ కానిస్టేబులు సీహెచ్ పోతులూరు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






