- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచితంగా కార్పొరేట్ విద్య.. ఐఐటీ-నీట్‌లో గురుకులాల సత్తా
ఆర్థికంగా వెనుకబడిన, పేద విద్యార్థుల ఉన్నత విద్య కలలను సాకారం చేయడంలో.. మహాత్మ జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్థికంగా వెనుకబడిన, పేద విద్యార్థుల ఉన్నత విద్య కలలను సాకారం చేయడంలో.. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఒకప్పుడు కార్పొరేట్ కాలేజీలకే పరిమితమైన ఐఐటీ, నీట్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో నేడు గురుకుల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. నాణ్యమైన విద్య, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లకు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఆదరణ రోజురోజుకూ రెట్టింపవుతోంది.
ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య..
సాధారణంగా ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ పొందాలంటే ప్రైవేట్ సంస్థల్లో లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించాలి. కానీ, జ్యోతిబా ఫూలే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఎంపికైన విద్యార్థులకు పూర్తి ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, డిజిటల్ తరగతులు, నిరంతర పర్యవేక్షణ, స్టడీ మెటీరియల్స్, వీక్లీ ప్రాక్టీస్ టెస్టుల ద్వారా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఈ సెంటర్లలో సీటు సాధిస్తే తమ పిల్లల భవిష్యత్తుకు తిరుగుండదనే నమ్మకం తల్లిదండ్రుల్లో బలపడింది. దీంతో డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు ప్రైవేటు కాలేజీల వైపు చూసిన విద్యార్థులు సైతం.. ఇప్పుడు ఫూలే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో సీటు కోసం పోటీ పడుతుండటం విశేషం.
100 శాతం సీట్లు భర్తీ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. 2018-19 విద్యా సంవత్సరంలో సరూర్‌నగర్ (గర్ల్స్), బాటసింగారంలో (బాయ్స్) కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 22 కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు రెండు చొప్పున ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటికే 100 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి. టెన్త్‌లో 500కు పైగా మార్కులు వస్తేనే వీటిల్లో అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ ఏడాది ఎంపీసీలో 1750, బైపీసీలో 1530, మొత్తం 3,280 మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో జాయిన్ అయ్యారు. ఇప్పటికే సెకెండ్ ఇయర్ స్టూడెంట్స్‌కు జేఈఈ, నీట్, ఎప్‌సెట్ పరీక్షల కోసం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.






