- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Free Chicken : ఫ్రీ చికెన్.. ఎగబడ్డ జనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) భయాందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) భయాందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ భయంతో రెండు రాష్ట్రాల్లో చికెన్(Chicken), గుడ్ల(Eggs) అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. చికెన్ కొనేవారు కరువయ్యి.. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో చికెన్ అమ్మకపు వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల చికెన్ షాపులు మూసివేస్తున్నారు. ప్రజల్లో చికెన్, గుడ్లు తినడం పట్ల ఉన్న భయాన్ని పోగేట్టేందుకు ఓ వైపు ప్రభుత్వం, డాక్టర్లు అనేక ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు చికెన్ వ్యాపారులు కూడా జనాల్లో బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆదివారం సిద్దిపేట(Siddipeta)లో చికెన్ షాపుల యజమానులు ఫ్రీ చికెన్ మేళా(Free Chicken Mela) నిర్వహించారు. జనాలకు చికెన్ ఫ్రై, ఉడికించిన గుడ్లు ఉచితంగా పంచారు. దీంతో జనాలు ఒక్కసారిగా చికెన్ మేళా మీద ఎగబడ్డారు. దాదాపు 200 కేజీల చికెన్ ఫ్రై, 2000 ఉదకబెట్టిన కోడిగుడ్లను పంచగా.. కేవలం పది నిముషాల్లో మేళా ఖాళీ అయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది జనాలు మేళాకు వచ్చి ఉంటారో. చికెన్, గుడ్లు బాగా ఉడికించి తినడం వలన బర్డ్ ఫ్లూ రాదని.. చికెన్ తినడం పట్ల భయం అవసరం లేదని వ్యాపారులు ప్రకటించారు. మరోవైపు వ్యాపారులు చేసిన ఈ వినూత్న ప్రయత్నాన్ని అధికారులు అభినందించారు.






