- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్రీ బస్సు.. ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు
తెలంగాణ రాష్ట్రంలో ( Telangana) ప్రస్తుతం ఉచిత బస్సు పథకం ( Free bus scheme) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ( Telangana) ప్రస్తుతం ఉచిత బస్సు పథకం ( Free bus scheme) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉచిత బస్సును మొట్టమొదటగా ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. అయితే.. ఈ మహాలక్ష్మి పథకం ( Mahalaxmi scheme) కింద తెలంగాణ రాష్ట్ర మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని... తాజాగా సర్కార్ అధికారిక ప్రకటన చేసింది.
ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిపోలు, బస్టాండ్స్, ఇతర ఆర్టీసీ కార్యాలయాలలో సంబరాలు చేయనుంది. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందికి సన్మానం చేయబోతోంది ఈ సర్కార్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా ప్రస్తుతం ప్రతిరోజు 30 లక్షల ఉచిత ప్రయాణాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి.






