మిమ్మల్ని తైవాన్‌కు ఆహ్వానిస్తున్నా: CM కేసీఆర్‌కు యంగ్ లియూ లేఖ

by Disha Web Desk 19 |
మిమ్మల్ని తైవాన్‌కు ఆహ్వానిస్తున్నా: CM కేసీఆర్‌కు యంగ్ లియూ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూ లేఖ రాశారు. తెలంగాణలోని కొంగర్ కలాన్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసే విషయంలో మార్చి 2వ తేదీన చర్చించినట్లుగానే మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. వీలైనంత వేగంగా కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో ఉన్నామని ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కోరుకుంటున్నట్లు సోమవారం రాసిన లేఖలో ఆకాంక్షించారు.

హైదరాబాద్ పర్యటన సందర్భంగా తన బృందానికి అందించిన ఆతిథ్యానికి ఈ సందర్భంగా యంగ్ లియూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా తైవాన్ ఆహ్వానిస్తున్నట్లు యంగ్ లియూ లేఖలో పేర్కొన్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఫాక్స్ కాన్ చైర్మన్ యింగ్ లియూ తన బృందంతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.


Next Story

Most Viewed