- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు..
చెట్టు కింద ఆడుకుంటున్న నలుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంఘటన నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధి వర్కూర్ గ్రామంలో జరిగింది.

దిశ మక్తల్: చెట్టు కింద ఆడుకుంటున్న నలుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంఘటన నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధి వర్కూర్ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెట్టు నీడలో ఆడుకుంటున్న చిన్నారులు తరబి, పసుల బవ్యశ్రీ, అభిరాం, దమయంతమ్మలపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో వారిని మక్తల్ ప్రభుత్వా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
వారం క్రితం గ్రామసభలో కుక్కలను తరలించాలని గ్రామస్తులు తీర్మానం చేసి ఎంపీడీవో కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా వెటర్నరి అధికారులు చర్యలు తీసుకోలేదని, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రాబిస్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను గ్రామం నుంచి దూర ప్రాంతాలకు తరలించి మండల కేంద్రంలోని ఆసుపత్రిలో రాబిస్ ఇంజక్షన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.






