DJ Sounds: డీజేలు.. యమ డేంజర్ గురు! శోభాయాత్రలో వాటి శబ్దాలకు నలుగురికి అస్వస్థత

by Ramesh Naini |   (  Updated:2025-09-05 14:54:58  IST  )

ఈ మధ్య చిన్న పండుగ వచ్చిన కొంతమంది డీజేలు పెడుతున్నారు. చాలా మంది డీజేలో వచ్చే పాటలకు అట్రాక్ట్ అవుతున్నారు.

DJ Sounds: డీజేలు.. యమ డేంజర్ గురు! శోభాయాత్రలో వాటి శబ్దాలకు నలుగురికి అస్వస్థత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్య చిన్న పండుగ వచ్చిన కొంతమంది డీజేలు పెడుతున్నారు. చాలా మంది డీజేలో వచ్చే పాటలకు అట్రాక్ట్ అవుతున్నారు. (DJ Sounds) డీజే శబ్దాలు యమ డేంజర్ అని తెలిసినా కూడా కొందరు లెక్క చేయడం లేదు. డీజే శబ్దాల వల్ల గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్, చెవ్వుల్లో సున్నితమైన బాగాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 70 డెసిబుల్స్ వరకు శబ్దాలను వినేందుకు చెవులు సహకరిస్తాయి. 90 పై డెసిబుల్స్ దాటితే ప్రమాదకరమే. డీజే సౌండ్ 200 డెసిబుల్స్ పైటే ఉంటుందని అందుకే.. లిమిట్ దాటితే యమ డేంజర్ గురు అంటూ నివేదికలు చెబుతున్నాయి.

తాజాగా డీజే శబ్దాలకు నలుగురికి అస్వస్థతకు గురయ్యారు. నిర్మల్ జిల్లా, భైంసాలోని (Ganesh procession) గణేష్ శోభాయాత్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ డీజే శబ్దాలతో స్థానిక పిప్రి కాలనీ గుండా గణేష్ శోభాయాత్ర తీశారు. డీజే శబ్దాలను భరించలేక.. కీర్తి అనే అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. అలాగే కాలనీలో మరో ముగ్గురు చిన్నారులు కూడా అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వినాయక ఉత్సవాల్లో భాగంగా తెలంగాణలో డీజేలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కూడా నిర్వాహకుల తీరు మాత్రం మారటం లేదు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎలాంటి ఊరేగింపులను భారీ సౌండ్‌లతో నిర్వహించకూడదు. కేవలం 70 డెసిబుల్స్ స్థాయి వరకే సౌండ్ పెట్టుకోవడానికి మాత్రమే సుప్రీం కోర్టు పర్మిషన్ ఇచ్చింది.

Next Story