- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకరికి నాలుగైదు ఓట్లు?.. చర్యలు తీసుకోవాలని సీఈవోకు బీఆర్ఎస్ విజ్ఞప్తి
కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం కలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం కలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్‌పై లోటుపాట్లు, సమస్యలపై వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఒక పౌరుడికి ఒక ఓటు ఉండాలని రాజ్యంగా హక్కు అని.. హైదరాబాద్ గ్లోబల్ సిటీలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి నాలుగైదు చోట్ల ఉన్నాయని.. అది చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఓట్ల వివరాలు తెలిస్తే కచ్చితంగా ఆయా రాష్ట్రాల సీఈవోలతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పామని.. అయినా కనీసం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఓట్లతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు వేశారని.. అవి తొలగించాలని కోరారు. ఎస్ఐఆర్ మీద అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సైతం సూచించారని తెలిపారు. అన్ని అంశాలను సీఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 15 సూచనలతో కూడిన వినతిపత్రం అందించినట్లు తెలిపారు.






