బిగ్ అలర్ట్.. ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు!

by velandi.Saikiran |

ఈ వారంలో మొత్తం నాలుగు రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బిగ్ అలర్ట్.. ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ వారంలో మొత్తం నాలుగు రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పలు జిల్లాలలో నాలుగు రోజుల పాటు హాలిడేస్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 11వ తేదీన బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఆ రోజున పోలింగ్ జరిగే ప్రాంతాలలో సెలవులు ప్రకటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

అలాగే మున్సిపల్ ఎన్నికల లెక్కింపు 13వ తేదీన ఉంటుంది. ఆరోజు శుక్రవారం అవుతోంది. ఈ త‌రుణంలోనే ఆ రోజున కూడా లెక్కింపు జరిగే స్కూల్స్, కార్యాలయాలకు హాలిడేస్ ఉండనున్నాయి. మరుసటి రోజు రెండో శనివారం అన్న సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 15వ తేదీన సండే కానుంది. ఇలా మొత్తం ఈ వారంలో నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి.

ఇవాళ సాయంత్రం నుంచి వైన్స్ బంద్

తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రచారం బంద్ కానుంది. ఈ నేపథ్యంలోనే మద్యం దుకాణాలు కూడా మూత పడబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూతపడతాయి. అలాగే ఈ ఎన్నికల కౌంటింగ్ 13వ తేదీన ఉన్న నేపథ్యంలో ఆ రోజున కూడా మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా మూసివేస్తారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ.

Next Story