- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాత్విక్ ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్ట్
by GSrikanth |
నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ యాజమాన్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి సాత్విక్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ యాజమాన్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి సాత్విక్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాత్విక్ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీని ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం కళాశాల డైరెక్టర్లు ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్లు నరేశ్, జగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి నార్సింగ్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈ నలుగురిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కాగా సాత్విక్ సూసైడ్ కు కారకులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Next Story






