- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: పోలీసుల ఎదుట లొంగిపోయిన జన నాట్యమండలి ఫౌండర్ సంజీవ్
రాచకొండ సీపీ ఎదుట ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో/సిటీ క్రైమ్: మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజాగా జన నాట్యమండలి ఫౌండర్, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటేరియట్ మెంబర్ సంజీవ్ అలియాస్ లెంగు దాదా, అతని భార్య స్టేట్ కమిటీ మెంబర్ పెరుగుల పార్వతి అలిగాయాస్ బొంతల పార్వతి అలియాస్ దీనా ఇవాళ రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. నాలుగు దశాబ్దాల పాటు సీపీఐ మావోయిస్టు పార్టీలో పని చేసిన వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు కూడా తిరిగి గ్రామాలకు రావాలని పోరు వద్దు.. ఊరు ముద్దు అని పులుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్ కు చెందిన సంజీవ్ 1980 లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ లో చేరారు. దండకారణ్యంలో చైతన్య నాట్య మండలిలో పని చేశారు. వివిధ ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గద్దర్ కు ముఖ్య అనుచరుడిగా పని చేశాడు. 2002 లో ఐలాపుర్ లో జరిగిన కాల్పుల్లో తప్పించుకున్నాడు.
అజ్ఞాతం వీడియాలి: సీపీ సుధీర్ బాబు
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జన జీవన స్రవంమతిలోకి రావాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. అడవులను వీడి తిరిగి గ్రామాలకు వచ్చే మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పునరావాస పథకంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందిస్తోందని ఉపాధి మార్గాలు చూపిస్తోందని చెప్పారు. సంజీవ్ అతని భార్య దీనా లొంగుబాటు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వీరిద్ధరిపై తల రూ.20 లక్షల రివార్డు ఉందని వీరికి ఆ రివార్డు నగదు ప్రభుత్వం తరఫున ఇస్తామని తెలిపారు. హింసను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలరు తిరస్కరిస్తున్నారన్నారు. కొంత మంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలింగించే రీతిలో వ్యవహరిస్తున్నారని అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






