CM Revanth Reddy : నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన : సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |

హైదరాబాద్ నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి(New Osmania Hospital)నిర్మాణానికి ఈ నెలాఖరు(Month-End)లోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా వెల్లడించారు.

CM Revanth Reddy : నెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి(New Osmania Hospital)నిర్మాణానికి ఈ నెలాఖరు(Month-End)లోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.

నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ కు పలు మార్పులు, చేర్పులను సూచించడం జరిగిందని, ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని ట్వీట్ లో పేర్కొన్నారు.

అంతకు ముందు కొత్త ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలన్నారు.

అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

Next Story