ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ రూపొందించండి: ఎస్టీయూటీఎస్ వినతి

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఉపాధ్యాయ ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల విద్యాశాఖలో వందలాది ఎంఈవో, డీఈవో పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని ఎస్టీయూటీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ రూపొందించండి: ఎస్టీయూటీఎస్ వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలన్‌ను ఎస్టీయూటిఎస్ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సంబంధించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల రాష్ట్రంలో వందలాది ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో, డైట్ లెక్చరర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు–2018 ప్రకారం ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా సర్వీస్ రూల్స్ రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయ, విద్యారంగ పరిపాలనా వ్యవహారాలు సక్రమంగా నిర్వహించేందుకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ అత్యంత అవసరమని ఎస్టీయూటీఎస్ అభిప్రాయపడింది.

Next Story