- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
BRS vs BJP: ఫార్ములా ఈ కారు రేస్ క్రెడిట్ మాదంటే మాదే!
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కారు రేస్ ఉల్లాసంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్ తీరంలో అంతర్జాతీయ రేసర్లు పోటీలో దూసుకుపోతున్నారు. ఈ పోటీలను చూసేందుకు టాలీవుడ్, బాలీవుడ్‌తో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి రావడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ రేస్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ రేసింగ్‌కు హైదరాబాద్ వేదికగా మారిందని ఈ ఘటన తెలంగాణ ప్రభుత్వానిదని బీఆర్ఎస్ మద్దతుదారులు ఇంటర్నెట్‌లో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. శనివారం ఫార్ములా ఈ రేస్‌కు హాజరైన కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఈ రేస్ జరగడానికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందన్న మీడియా ప్రశ్నకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే ఎలా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేసింగ్ మొట్టమొదటి సారి హైదరాబాద్‌లో జరగడం సంతోషకరమన్నారు. ఈ రకమైన కార్యక్రమాల ద్వారా దేశ పర్యాటక రంగం మరింత బలపడుతుందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలను మోటివేట్ చేయడానికి ఈ తరహా కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ప్రపంచంలోనే అనేక దేశాలు గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న రేస్‌కు కేంద్రం సహకారం ఉందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీకి మద్దతుదారులైన నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. తమకు అనుకూలమైన కామెంట్స్ చేస్తూ మరింత హాట్ టాపిక్‌గా మారుస్తున్నారు.