'వాకథాన్'‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక సందేశం

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో 'ది ఫుట్ డాక్టర్ హాస్పిటల్' వారు.. 'వాకథాన్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

వాకథాన్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని రాయదుర్గంలో 'ది ఫుట్ డాక్టర్ హాస్పిటల్' వారు.. 'వాకథాన్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో మధుమేహం (Diabetes) విస్తరిస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచిదన్నారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలు ఆరోగ్యంగా జీవించడానికి చిన్ననాటి నుంచే అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామం, యోగా సాధన, క్రీడల్లో పాల్గొనడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడం చాలా ముఖ్యమని వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు.

పిల్లలు ఈ అలవాట్ల ద్వారా ఆరోగ్యంగా ఎదగడానికి, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇవి తోడ్పడతాయని ఆయన వివరించారు. ఈ వాకథాన్ ద్వారా ప్రజలకు అందిస్తున్న ప్రధాన సందేశం కూడా ఇదేనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

Next Story