- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పరిణామాలన్నీ కళ్ళముందు కదలాడాయి: వెంకయ్య నాయుడు
ఆ పరిణామాలన్నీ కళ్ళముందు కదలాడాయి: వెంకయ్య నాయుడు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని దేశోద్ధారక భవన్‌లో వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రచురించిన రెండు విశిష్టమైన పుస్తకాలు 'అనుభవాలు-జ్ఞాపకాలు', 'అప్పుడు-ఇప్పుడు'లను ఆదివారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత అద్భుతమైన పుస్తకాలు స్వయంగా నేనే ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. వయోధిక పాత్రికేయులు తమ అనుభవాలను 'అనుభవాలు జ్ఞాపకాలు' పుస్తకంలో గుదిగుచ్చగా, ఆనాటి మరో ప్రముఖ పాత్రికేయుడు జి.కృష్ణ (జీకే) రాసిన వ్యాసాలను 'అప్పుడు-ఇప్పుడు', పుస్తక రూపంలో తీసుకురావడం మంచి విషయమని ప్రశంసించారు.
ఈ రెండు పుస్తకాలను చదివినప్పుడు ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలన్నీ కళ్ళముందు కదలాడాయని అన్నారు. పాత్రికేయ వృత్తి ఎంతటి క్లిష్టమైనదో, కత్తి మీద సాము లాంటిదో, ఎంతటి బాధ్యతాయుతమైనదో ఈ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. పత్రికారంగంలో మార్పులను, మేధావుల అనుభవాలను రికార్డు చేసిన ఈ కృషి అభినందనీయమని కొనియాడారు. నేటితరం పాత్రికేయులు, మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు ఇవి అని సూచించారు. ఎందుకంటే గతం లేనిదే వర్తమానం లేదు, వర్తమానం లేనిదే భవిష్యత్తు లేదు.. ఈ రెండు పుస్తకాలు గొప్ప రిఫరెన్సులుగా నిలుస్తాయి. పాతతరం జర్నలిస్టుల అనుభవాలు, విలువలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు నేటి యువతకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ట్వీట్






