సీఎం కేసీఆర్ మాయమాటలకు టైమ్ ఓవర్: కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్

by Satheesh |   (  Updated:2023-11-27 17:17:49  IST  )

ఈ నెల 30 జరగనున్న పోలింగ్‌తో తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు చక్కటి మార్పు చేకూరనుందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. అదే రోజు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనకు,

సీఎం కేసీఆర్ మాయమాటలకు టైమ్ ఓవర్: కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 30 జరగనున్న పోలింగ్‌తో తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు చక్కటి మార్పు చేకూరనుందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. అదే రోజు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, కేసీఆర్ మాయ మాటలకు కాలం చెల్లుతుందన్నారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 9 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని. కేవలం ప్రకటించడమే కాకుండా తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటు చేశామని తెలిపారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ప్రతి ఒక్కటి అమలు చేసి తీరుతుందన్నారు.

తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉంటూ రాష్ట్రాభివృద్ది, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. అధికారంలో ఉండి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించలేని కేసీఆర్ సర్కార్ మరో సారి గెలిస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించటడం హాస్యస్పదమని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లతో పాటు మేనిఫెస్టోను సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులను కట్టడి చేస్తే ఆరు గ్యారంటీలతో పాటు మరిన్ని వెల్ఫేర్ స్కీములను ప్రజలకు అందించే వెసులుబాటు ఉందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.

Next Story